విద్యుత్ సంస్థల బోర్డు డైరెక్టర్‌‌‌‌గా వికాస్ రాజ్

విద్యుత్ సంస్థల బోర్డు డైరెక్టర్‌‌‌‌గా వికాస్ రాజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌‌‌‌ను పలు విద్యుత్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్‌‌‌‌గా, వాటాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన నవీన్ మిట్టల్ స్థానంలో వికాస్ రాజ్ ఇటీవల ఇంధన శాఖ బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఆయా సంస్థల బోర్డుల్లో ఆయనకు చోటు కల్పించింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో, సదరన్ డిస్కమ్‌‌‌‌లలో నాన్ హోల్ టైమ్ డైరెక్టర్‌‌‌‌గా, వాటాదారుడిగా, నార్తర్న్ డిస్కమ్‌‌‌‌లో వాటాదారుడిగా, సింగరేణి, రెడ్‌‌‌‌కో సంస్థల్లో డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థల సీఎండీలు, వీసీ అండ్ ఎండీలను ప్రభుత్వం ఆదేశించింది.